हिन्दी  বাংলা  தமிழர்  اردو  తెలుగు  ಕನ್ನಡ  ਪੰਜਾਬੀ
Search
Eenadu | తెలుగు పాటలు | కూడలి / బ్లాగులు / కూడలి 100 |

 •  KadaliTaraga : a wave in the Ocean !: అంకెల మాయ – అసలు నిజాలు

‘అసత్యాలు మూడు రకాలు: అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, గణాంకాలు’ అని పందొమ్మిదో శతాబ్దపు బ్రిటిష్ ప్రధానమంత్రి బెంజమిన్ డిజ్రాయిలీ అన్నాడని అమెరికన్ వ్యంగ్య రచయిత మార్క్ ట్వెయిన్ రాశాడు. గణాంకాలనేవి సామాజిక వాస్తవికతను క్లుప్తంగా, సారభూతంగా వివరించే రూపాలు గనుక, గణాంకాల సహాయంతో సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవడం సులభం గనుక, గణాంకాలను వాడక తప్పదు. కాని వాటిని తగినంత జాగ్రత్తగా వాడకపోతే అవి పచ్చి అబద్ధాలుగా, సమర్థనయోగ్యం కాని వాదనలను సమర్థించుకునే ఆధారాలుగా మారిపోతాయి.

ఇటీవల సాగుతున్న చర్చోపచర్చలలో గణాంకాల వాడకం చాల విస్తృతంగా జరుగుతున్నది. అంకె అంటే ఏమిటి, ఆ అంకె దేన్ని సూచిస్తుంది, దేన్ని మరుగుపరుస్తుంది, అంకెల వెనుక దాగి ఉండే సంక్లిష్టత ఏమిటి, అంకె నిరపేక్షంగా ఉంటుందా, సాపేక్షికంగా ఉంటుందా, ఒక అంకెను మరొక అంకెతో పోల్చి చూపేటప్పుడు పాటించవలసిన ప్రమాణాలేమిటి, అంకెలలో పెరుగుదలకు, సామాజిక అభివృద్ధికి తేడా ఏమిటి అనే కనీస పరిజ్ఞానం లేనట్టు కనబడుతున్న రచనలు చాల అచ్చవుతున్నాయి. ఆ అంకెలు, వాటిమీద ఆధారపడిన నిర్ధారణలు తమ అభిప్రాయాలకు అనుకూలమైనవైతే వాటిని నెత్తికెత్తుకోవడం, పదేపదే ఉటంకించడం, తమ అభిప్రాయాలకు భిన్నమైనవైతే అవన్నీ దొంగలెక్కలనీ, అబద్ధాలనీ కొట్టిపారేయడం అన్నివైపులా చాల ఎక్కువగా జరుగుతున్నది. ఇటీవలి చర్చలలో ప్రతి ఒక్కరూ చరిత్రకారులుగా, గణాంకశాస్త్రవేత్తలుగా, అర్థశాస్త్రవేత్తలుగా పరిణమిస్తున్నారు. గతంలో చరిత్రకారులుగా, గణాంకశాస్త్రవేత్తలుగా, అర్థశాస్త్రవేత్తలుగా ఉండినవారుకూడ ప్రస్తుతం తమ రాగద్వేషాలకే ప్రాధాన్యత ఇచ్చి శాస్త్ర ప్రమాణాలను పక్కన పెడుతున్నారు. మొత్తం మీద అయా శాస్త్రాలు నిర్దేశించే పద్ధతులు, ప్రమాణాలు, జాగ్రత్తలు అన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి.

అలా అంకెల గురించి కూడ భావోద్వేగాలు పెరిగిన ఈ సున్నితమైన నేపథ్యంలో ఒకరి అంకెలు సరయినవనీ, మరొకరి అంకెలు తప్పులనీ చెప్పే పరిస్థితి కనుమరుగవుతున్నది. ఒక్కోసారి రెండు పక్షాలు చెప్పే అంకెలూ నిజాలే గాని వాటిని చూడవలసిన పద్ధతి, చూస్తున్న పద్ధతి విభిన్నంగా ఉంటున్నాయి. ఒక్కోసారి రెండు పక్షాల అంకెలూ నిజాలే అయినా పరస్పరం సంబంధం లేనివిగా ఉంటున్నాయి గనుక వాటిమధ్య తులనాత్మకత ఉండడం లేదు. ఒక్కోసారి రెండు పక్షాలూ తమకు అనుకూలమైన అంకెలనే ఉదహరిస్తూ, ప్రతికూలమైన అంకెలను దాటవేస్తున్నాయి. ఇక ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఉపపత్తులను, తప్పుడు అంకెలను వండుతున్నవారి గురించి చెప్పనవసరమే లేదు. ఈ పరిస్థితిలో గణాంకాల వెనుక ఉన్న లోతయిన అంశాల గురించి, గణాంకాల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి, అంకెల వినియోగంలో శాస్త్రీయమైన, ప్రామాణికమైన పద్ధతి గురించి మళ్లీ ఒకసారి గుర్తు చేయడం అవసరమనిపిస్తున్నది.

అసలు తమ అభిప్రాయాలనో, అపోహలనో అంకెలద్వారా వ్యాపింపజేయాలని ఎవరయినా ఎందుకు అనుకుంటున్నారో ముందు అర్థం చేసుకోవలసి ఉంది. మౌఖిక సంస్కృతి ప్రధానంగా ఉన్న మన సమాజంలో ఎవరి చేతయినా దేన్నయినా సమ్మించాలంటే ‘ఫలానాచోట రాసి ఉంది తెలుసా’ అని చెప్పే అలవాటు ఉంది. అంటే లిఖితంగా ఉంటే చాలు నమ్మదగినదేననే అభిప్రాయం ఉంది. సరిగ్గా అలాగే చాలమంది అంకెలలో ఉంటే నమ్మదగినదేననుకుంటారు. కనుక అంకెలతో మాయ చేయడం సులభం. ఒకరకంగా చెప్పాలంటే అంకెలు ఈ కాలపు సంస్కృతం. అవతలివాళ్లను భయపెట్టాలంటే అంకెలు వల్లిస్తే చాలు. ఇవాళ చాలమంది మంత్రోచ్ఛాటనలా అంకెలను వల్లించడం అందువల్లనే.

అయితే సమస్య ఏమంటే అంకెలు సామాజిక వాస్తవికతా సారాన్ని ఎట్లా ప్రకటించగలవో, అట్లాగే అవాస్తవాలకు విశ్వసనీయత ముసుగు కూడ కప్పగలవు. అబద్ధాలు ప్రచారం చేయదలచుకున్నవాళ్లు అంకెలను దుర్వినియోగం చేస్తున్నప్పుడు, నిజాలు చెప్పదలచుకున్నవాళ్లు కూడ ఆ అంకెల మీదనే ఆధారపడక తప్పదు. ఈ అంకెల యుద్ధాలలో అసలు అంకెలు ఎవరివో, అంకెలను దుర్వినియోగం చేస్తున్నదెవరో తెలియని గందరగోళం వ్యాపిస్తుంది. అందువల్ల అంకెల మాయను గ్రహించాలంటే కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవలసి ఉంది.

గణాంకాలను ఉటంకిస్తున్నవారు ఆ అంకెలను తమ ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారా, తమకు రుచించని అంకెలను విస్మరిస్తున్నారా జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడయినా ఏ సాధారణీకరణకైనా మినహాయింపులుంటాయి. ఒకరు ఉటంకిస్తున్న అంకె సాధారణమైనదా, మినహాయింపుదా చూస్తే దాని విశ్వసనీయత ఎంతో అర్థమవుతుంది. ఒక అంకె మీద ఆధారపడి రెండో అంకెను తొక్కిపెట్టడం కాకుండా, రెండో అంకెను కూడ ప్రస్తావించి వివరించగలిగినపుడే అంకెల వాడకం విశ్వసనీయమవుతుంది.

అలాగే గణాంకాలను ప్రస్తావించడమే ముఖ్యం కాదు, వాటిని వ్యాఖ్యానించడం ప్రధానం. ఉత్తి అంకెకు ఏ అర్థమూ లేదు. దాన్ని వివరించే, వ్యాఖ్యానించే క్రమంలోనే ఆ అంకెకు ఒక అర్థం వస్తుంది. కనుక ఒక అంకెకు వ్యాఖ్యాత ఏ అర్థం చెపుతున్నారో, మరొక అర్థం వచ్చే అవకాశం ఉందో లేదో జాగ్రత్తగా గమనించాలి. మరొక అర్థం వచ్చే అవకాశం ఉందంటే ఆ అంకె విశ్వసనీయత సందేహాస్పదమే.

ఇటీవలి కాలంలో వృద్ధిరేటు అనే అంకెను ఉటంకించడం, దానిద్వారా తమ వాదన బలపరచుకోవడం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిజానికి వృద్ధిరేటు అనేది సాపేక్షిక సంఖ్యే తప్ప దానికదిగా అభివృద్ధి సూచిక కాదు. వృద్ధి అంటే ఒకచోటి నుంచి మరొకచోటికి, కిందిస్థాయి నుంచి పైస్థాయికి కదలడం, పరిమాణాత్మకంగా మారడం అని మాత్రమే అర్థం. ఆ మార్పు అభివృద్ధి వైపూ కావచ్చు, తిరోగమనం వైపూ కావచ్చు. ‘పది సంవత్సరాల కింద సాలీనా ఐదువందల ఆత్మహత్యలు జరిగేవి, ప్రస్తుతం పదిహేనువేల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అంటే మూడువేల శాతం వృద్ధిరేటు ఉంది’ అని చెప్పడం హాస్యాస్పదం.

అలాగే అంకెలు పెరగడమే వృద్ధి కాదు, ఆ అంకె సూచించే చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఆ అంకె వాస్తవికంగా అర్థమవుతుంది. ‘ఐదు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి – వెలుగునీడలు’ (2005) వ్యాసంలో ఈ అంకెల మాయకు సంబంధించి ఇచ్చిన అనేక ఉదాహరణలలో ఒకదాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తాను: 1956 నాటికి రాష్ట్రంలో నమోదయిన వాహనాలలో రిగ్ అనే వాహనం లేదు. 2003 మార్చ్ నాటికి రాష్ట్రంలో 1491 రిగ్గులున్నాయి. ఇది కొందరికి అభివృద్ధి సూచికగా కనబడవచ్చు. ఇంకా కొంచెం లోతుకు వెళితే 251 రిగ్గులతో కరీంనగర్, 240 రిగ్గులతో నల్లగొండ, 205 రిగ్గులతో రంగారెడ్డి జిల్లాలు ‘అభివృద్ధి పథం’లో అగ్రభాగాన ఉన్నట్టు కనబడతాయి. కానీ ఈ నాణానికి అవతలివైపు ఈ మూడు జిల్లాలలో నానాటికీ అడుగంటిపోయిన భూగర్భజలాలు, బావులు వట్టిపోవడం, బావుల మోటలకు అవసరమయిన పనులు చేసే వడ్రంగి, కమ్మరి, తోలు పనుల వృత్తిదారుల ఉపాధి రద్దయిపోవడం, పశువుల అవసరం తీరిపోయి కబేళాలకు తరలించడం వంటి పరిణామాల వరుస కనబడుతుంది. కనుక ఒక మారుమూల తెలుగు గ్రామంలోకి రిగ్ అనే అత్యాధునిక ఉత్పత్తి సాధనం ప్రవేశించడం అభివృద్ధా కాదా అనే ప్రశ్నకు సూటిగా ఒకే జవాబు చెప్పగల స్థితిలేదు. ఒక ఆధునిక పారిశ్రామిక పరికరంగా రిగ్ ప్రవేశం ఆధునికతకు, అభివృద్ధికి ఎంత సూచికో, అది పరోక్షంగా  కొల్లగొట్టిన ఉపాధికి, భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి చిహ్నంగా అభివృద్ధి రాహిత్యానికీ అంతే సూచిక. అటువంటి పరిణామాన్ని అంకెలతో పట్టుకోవడం అసాధ్యం.

అలాగే వృద్ధిరేట్లను ప్రస్తావిస్తూ ఇటీవలి చర్చలో వందలశాతం, వేలశాతం పెరుగుదల గురించి మాట్లాడుతున్నారు. ఒకప్రాంతంలో వేలశాతం పెరుగుదల ఉండగా మరొకప్రాంతంలో వందల శాతమో, రెండంకెల శాతమో ఉన్నదని, అందువల్ల అభివృద్ధి ఒకచోటే జరిగిందని, మరొకచోట జరగలేదని కూడ వాదిస్తున్నారు. వృద్ధిరేటును చారిత్రక పరిణామంలో చూడాలని అవసరంకొద్దీ మరచిపోతున్నారు. ఎప్పుడయినా ప్రాతిపదిక (బేస్) తక్కువగా ఉన్నప్పుడు వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండుగా మారడం వందశాతం పెరుగుదల అయితే, పది పదకొండుగా మారడం పది శాతం పెరుగుదల మాత్రమే అవుతుంది. రెండుచోట్లా పరిమాణంలో చూస్తే అదనంగా చేరినది ఒకటే, సమానమే. కాని వృద్ధి రేటు లెక్కగడితే అంత తేడా వస్తుంది. ఈ విషయం గమనంలో పెట్టుకోకుండా, చారిత్రక పునాది చూపకుండా వేలశాతం వృద్ధిరేటు గురించి మాట్లాడడం అర్థరహితం.

అలాగే గణాంక శాస్త్ర పాఠ్య గ్రంథాలు, గణాంక శాస్త్రవేత్తలు పదే పదే చేసిన హెచ్చరికలు కూడ ప్రస్తుత చర్చలో కనుమరుగవుతున్నాయి. అందరూ వాటిని మరచిపోతున్నారు గనుక మరొకసారి గుర్తుచేయవలసి ఉంది. గణాంకాలు పరిమాణాన్ని మాత్రమే చెపుతాయి గాని గుణాన్ని చెప్పవు.  గణాంకాలు రెండు విభిన్న అంశాల మధ్య పోలికను మాత్రమే చెప్పగలవు గాని కార్యకారణ సంబంధాన్ని చెప్పజాలవు. గణాంకాల ద్వారా స్థూలమైన నిర్ధారణలు చేయవచ్చు గాని ఆ నిర్ధారణ నూటికి నూరు శాతం నిజం కాదు. ఇతర సామాజిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే ఆ గణాంకాలు పరిపుష్టమవుతాయి. గణాంకాల వినియోగం న్యాయాన్ని బలపరచడానికి జరగాలి గాని, అన్యాయాన్ని సమర్థించడానికి కాగూడదు. సమస్య అంకెలది కాదు, న్యాయాన్యాయలది. చరిత్రలో జరిగిన అన్యాయాలది. ఆ అన్యాయాలను సవరించడానికి జరిగే ప్రయత్నానిది.


 
 •  KadaliTaraga : a wave in the Ocean !: ధరల గురించి ధరాధిపతుల అబద్ధాలు

ఫిబ్రవరి 23, 2010, ఈభూమి కోసం

తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని ఒక పెద్దమనిషి జవాబిచ్చాడని మనందరికీ తెలిసిన సామెత. పొంతనలేని అబద్ధాలు చెప్పే వ్యవహారాన్ని సూచించడానికి ప్రాచీన వివేకం ఈ నుడికారాన్ని తయారు చేసింది. దూడగడ్డికోసం ఎక్కవలసింది తాటిచెట్టు కాదని, అక్కడ గడ్డి దొరకదని, ఆ రెండిటికీ సంబంధం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా తాడిచెట్టు ఎక్కదలచిన తాగుబోతు తనను తాను వంచించుకుంటూ ఇతరులను వంచించడానికి ప్రయత్నిస్తుంటాడు.

డా. మన్మోహన్ సింగ్ విశ్వ విఖ్యాత అర్థశాస్త్రవేత్త గనుక, భారతీయ రిజర్వ్ బ్యాంకు లోనూ, ప్రపంచ బ్యాంకు లోనూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలోనూ, సౌత్ కమిషన్ లోనూ చిరకాలం పనిచేసి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా చేరి ప్రపంచీకరణ క్రమాన్ని ప్రారంభించారు గనుక, గత ఆరు సంవత్సరాలుగా ప్రధాన మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు గనుక అంతటి పెద్దమనిషిని ఆ దూడగడ్డి సాకు చెప్పిన తాగుబోతుతో పోల్చడం భావ్యం కాదు.

కాని ఆయన నోటివెంట ఫిబ్రవరి 6న వెలువడిన ఒక ప్రకటన అక్షరాలా దూడగడ్డి సామెతకు సరిపోయేలా ఉండడం ఆశ్చర్యకరం. ఆరోజున న్యూఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులను రానిస్తేగాని ధరలు తగ్గవని ప్రబోధించారు. లేదా తిరగేసి చెప్పాలంటే చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎందుకు అహ్వానిస్తున్నారంటే ధరలు తగ్గించడానికే అని చెప్పారు. ఇటీవల జనసామాన్యాన్ని తీవ్రంగా ఆందోళన పరుస్తున్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల గురించి చర్చించడానికి ఆ సమావేశం ఏర్పాటయింది. మరీ ముఖ్యంగా ఆహారపదార్థాల ధరల వార్షిక పెరుగుదల రేటు 17.56 శాతం దాటిన ఆందోళనకర స్థితిలో ఈ సమావేశం ఏర్పాటయింది. అంటే అక్కడ ప్రధానంగా ధరల గురించి, ధరల పెరుగుదల గురించి, ఆ ధరల పెరుగుదలను అరికట్టే మార్గాల గురించి చర్చించవలసి ఉండింది. ఆ చర్చ ఎంత జరిగిందో తెలియదు గాని, ‘జీ హుజూర్, జో హుకుం’ అని బహుళజాతి సంస్థలకు మరొకసారి విన్నవించడానికి సర్వసత్తాక ప్రజాస్వామిక భారత ప్రధానమంత్రి ఆ వేదికను కూడ వినియోగించుకున్నారు.

ఆ సమావేశంలో ప్రధాన ప్రసంగం చేసిన ప్రధాని, ధరల పెరుగుదలను అరికట్టాలంటే చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవేశంపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను రద్దుచేయవలసిందేనని బల్లగుద్ది చెప్పారు. రైతులకు వ్యవసాయోత్పత్తులకు అందుతున్న ధరలకూ మార్కెట్లో కొనుగోలుదారులు చెల్లిస్తున్న చిల్లర ధరలకూ మధ్య చాల వ్యత్యాసం ఉందనీ, ఆ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే, వినియోగదారులకు పొలంధరకు సరుకులు అందేలా చూడాలంటే  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానించవలసిందేనని అన్నారు. ఇటీవల చిల్లర ధరల పెరుగుదల టోకు ధరల పెరుగుదల కన్న ఎక్కువగా ఉంటున్నదని, ఎక్కువ పోటీ ఉన్నప్పుడే చిల్లర ధరలు టోకు ధరలకన్న తక్కువగా పెరుగుతాయని ఆయన కొత్త ఆర్థిక సిద్ధాంతాలు కూడ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు వేసే పన్నులు, సెస్సులు, లెవీలు ఇటీవలి కాలంలో చాల పెరిగిపోయాయని, ఒక్కోచోట అవి చిల్లర ధరలలో 10-15 శాతం దాకా కూడ ఉంటున్నాయని, అందువల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించడమంటే ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తొలగించడం అని అర్థం. ప్రస్తుతం ఒకే బ్రాండు అమ్మకాల చిల్లర వ్యాపారంలో 51 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశానికి అనుమతి ఉంది గాని, వివిధ బ్రాండుల సరుకులను ఒకేచోట అమ్మే చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశంపై నిషేధం ఉంది. అంటే, అందరికీ తెలిసిన భాషలో చెప్పాలంటే, ఒకే ఒక్క బ్రాండు సరుకులు – అది మెక్ డొనాల్డ్స్, కెంటకీ ఫ్రైడ్ చికెన్, పిజ్జా హట్, రీబోక్, నైకీ, అదిదాస్, లీవైస్, టామీ హిల్ ఫిగర్, సోనీ వంటి ఏ సరుకు అయినా కావచ్చు – అమ్మే దుకాణాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 51 శాతానికి లోబడి దేశంలోకి ప్రవేశించవచ్చు. అది స్వదేశీ ఎగుమతి గృహంతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త రంగ దుకాణం రూపంలోగాని, ఫ్రాంచైజీ రూపంలోగాని, దుకాణంగా పనిచేయని కార్యాలయ రూపంలోగాని ఉండవచ్చు. ఇప్పటికే దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, ఆహారపదార్థాలు, వినోద సాధనాలు అమ్మే ఇటువంటి ఒకేబ్రాండు దుకాణాలు ఇప్పటికే ఏర్పడి ఉన్నాయి.

కాని దేశవ్యాప్తంగా దుకాణాల గొలుసు వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి, ఆ దుకాణాలలో అన్ని బ్రాండ్ల సరుకులూ అమ్మదలచుకున్నట్టయితే, ఆ సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఉండడానికి వీలులేదు. ఆ దుకాణాలలో పూర్తిగాగాని, ఎంతో కొంత వాటా రూపంలో గాని విదేశీ పెట్టుబడి జోక్యం ఉండడానికి వీలులేదు.  నిజానికి బహుళజాతి సంస్థలకు అటువంటి దుకాణాల మీద చాల మోజు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లాభాలు సంపాదిస్తున్న, అత్యధిక జనాభాను ఆకర్షిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో అగ్రభాగాన ఉన్నవి అటువంటి చిల్లర వ్యాపారంలో ఉన్న గొలుసు సంస్థలే. అమెరికాలోనూ, యూరప్ లోనూ అటువంటి దుకాణాలదే రాజ్యం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లాభాలు సంపాదిస్తున్న బహుళజాతిసంస్థల జాబితాలో ఒక చమురు కంపెనీ మొదటి స్థానంలో ఉండగా చిల్లర వర్తకంలో ఉన్న వాల్ మార్ట్ స్టోర్స్ రెండో స్థానంలో ఉంది. ఫార్చూన్ 500 ప్రకారం 2009 లో దాని అమ్మకాలు 40,560 కోట్ల డాలర్లు (19,06,320 కోట్ల రూపాయలు) గానూ, లాభాలు 1340 కోట్ల డాలర్లు (62,980 కోట్ల రూపాయలు) గానూ ఉన్నాయి.

ఈ భారీ దుకాణాల ఉదాహరణ చూడలంటే అమెరికాలో తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం దాకా, ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా ఎంత చిన్న పట్టణానికి వెళ్లినా నాలుగైదు వ్యాపారసంస్థల సువిశాలమైన మాల్స్ మాత్రమే ఉంటాయి.  అవి వాల్ మార్ట్, కె మార్ట్, టార్గెట్, కాస్ట్ కో, షాప్ కో వంటి భారీ దుకాణాలు. ఎకరాలకొద్దీ విస్తరించిన ఆ దుకాణాలలో గుండుసూది నుంచి విమానందాకా, ఆవాల నుంచి బియ్యందాకా, కొత్తిమీర నుంచి కంప్యూటర్ల దాకా అన్ని బ్రాండ్లకు చెందిన అన్ని సరుకులూ దొరుకుతాయి. అవి సాధారణంగా పట్టణానికి చివర వందలాది ఎకరాలలో విస్తరించి ఉంటాయి. వాటి కార్ పార్కింగ్ స్థలమే డజన్ల ఎకరాలు ఉంటుంది. ఒక్క అగ్గిపెట్టె అత్యవసరంగా కావలసి వచ్చినా ఇరుగుపొరుగు దుకాణాలు ఉండవు గనుక, అటువంటి చిన్న దుకాణాలన్నిటినీ పద్ధతి ప్రకారం చంపేశారు గనుక ఏం కావాలన్నా ఈ మాల్స్ కు వెళ్లవలసిందే. ప్రతిదీ కావలసినదానికన్న ఎక్కువ పరిమాణంలో కొనుక్కోవలసిందే. ప్రతి కుటుంబమూ కారులో అక్కడికి వెళ్లి గంటల తరబడి అక్కడ సరుకులు చూస్తూ, కొనుగోళ్లు చేస్తూ గడుపుతుంది. విలువైన సమయాన్ని ఇలా వృధా చేయడానికి అమెరికన్ సంస్కృతి ‘కొనుగోలు అనుభవం’ అని ఒక ముద్దు పేరు కూడ పెట్టింది.

ఇటువంటి పెద్ద దుకాణాలలో సరుకులను నేరుగా ఉత్పత్తి దారులనుంచి సేకరిస్తారు గనుక, మధ్యవర్తుల గొలుసు ఉండదు గనుక చివరి కొనుగోలుదారు తక్కువ ధరకు కొనుక్కోవచ్చునని ఒక సైద్ధాంతిక సమర్థన కూడ చేస్తుంటారు. కాని మొదట ఇతర చిల్లర దుకాణాలను దెబ్బతీయడానికి తక్కువకు అమ్మినా, ఆ దుకాణాలన్నీ మూతబడిన తర్వాత మధ్యవర్తులందరూ కలిసి వేసుకునే లాభాలను ఈ ఒక్క అమ్మకందారే వేసుకున్నా చేయగలిగిందేమీ లేదు.  అప్పుడు వినియోగదారులకు ఆ ధరలకు కొనుక్కోవడం కన్న గత్యంతరం ఉండదు. అలాగే ఒక పట్టణంలోనో, గ్రామంలోనో కొన్ని డజన్ల, వందల దుకాణాలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, ఇరుగుపొరుగున మానవసంబంధాలతో కొనసాగుతుండగా, ఈ పెద్ద దుకాణాలు వాటన్నిటినీ చంపేసి, యాంత్రీకరణ చేసి, ఉపాధికల్పనను తగ్గిస్తాయి, మానవసంబంధాలను తగ్గిస్తాయి. ఒక వాల్ మార్ట్ లో కనీసం 30,000 రకాల సరుకులు ఒకే చోట దొరుకుతాయని, ఆ గందరగోళంలో ఎటూ తేల్చుకోలేని వినియోగదారులు, కొనుగోలుదారులు ఏదో ఒక బ్రాండుకు కట్టుబడి అది ఎలా ఉన్నా అదే కొనుక్కుంటూ ఉండడానికి సిద్ధపడతారని, అలా బ్రాండ్ విధేయత రూపొందుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అలాగే కొన్ని గంటలపాటు అన్ని సరుకుల మధ్య కొన్ని కిలోమీటర్ల పాటు తిరిగినప్పుడు అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనకతప్పని మానసినస్థితి ఏర్పడుతుందని, వారి జేబులో డబ్బు లేకపోయినా, క్రెడిట్ కార్డ్ సహాయంతో కొనవచ్చునని చెప్పి వారికి ఆ సరుకులను మప్పడం మొదలవుతుందని కూడ అధ్యయనాలు చెపుతున్నాయి.

ఇలా చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడి, గొలుసు దుకాణాల భారీవ్యవస్థలు ఎందుకు రాగూడదో, వాటివల్ల అనర్థాలేమిటో ఇప్పటికే ఎన్నో వాదనలు ఉన్నాయి. మన దేశంలో ఈ భారీ దుకాణాలు ప్రవేశిస్తే, కోట్లాది మంది ఉపాధి కోల్పోతారని, చిన్న, గ్రామీణ, ఇరుగుపొరుగు దుకాణాల చుట్టూ అల్లుకున్న మానవసంబంధాలు ధ్వంసమవుతాయని ఆందోళనలు వినబడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒక కోటీ యాభై లక్షల చిల్లర దుకాణాలు ఉన్నాయని, వాటిలో మొత్తం ప్రత్యక్షంగా నాలుగుకోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, వీటిని ధ్వంసంచేసి పెద్ద దుకాణాలను అనుమతించగూడదని వాదనలు ఉన్నాయి.

కాని 1992 నుంచీ సాగుతున్న ప్రపంచీకరణ క్రమంలో అన్ని ప్రభుత్వాలూ క్రమక్రమంగా దేశీయ, స్వావలంబన విధానాలకు తూట్లు పొడుస్తూ, బహుళజాతి సంస్థల అనుకూల విధానాలను కొద్దికొద్దిగా ప్రవేశపెడుతూ వచ్చాయి. ఆ క్రమంలోనే టోకు వర్తకంలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడి ప్రవేశానికీ, ఒకే బ్రాండు వ్యాపారంలో 51 శాతానికి మించని పెట్టుబడి ప్రవేశానికీ అనుమతి దొరికింది.

ఇంకా మిగిలిపోయిన ఆంక్షలు విభిన్న బ్రాండుల విశాల విపణులలో విదేశీ పెట్టుబడి ప్రవేశం మీద మాత్రమే. అటువంటి విభిన్న బ్రాండుల విశాల దుకాణాల గుత్తాధిపత్య వ్యాపారాన్ని అనుమతించాలని భారీ బహుళజాతి సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు, వారి స్వదేశీ దళారులు, పారిశ్రామిక, వ్యాపారవర్గాల సంస్థలు చాల కాలంగా కోరుతున్నాయి. ఆ కోరికలకు మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం లొంగకపోతే ఆశ్చర్యం గాని, లొంగితే ఆశ్చర్యం ఏమీలేదు. అందుకే ఫిబ్రవరి 6 మన్మోహన్ సింగ్ ప్రకటన తర్వాత బహుళజాతి సంస్థలు, వారి దళారులు ఆయన మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

అలా చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశిస్తే కలగబోయే అనర్థాలేమిటి, ఆ పరిణామం ఏ ప్రయోజనాలను చూపెట్టి, ఏ దుష్పరిణామాలను దాస్తున్నది, ఆ చూపెట్టే మేళ్లయినా సక్రమంగా అమలు జరుగుతాయా, ఆ కీడులకు అంతిమ పర్యవసానం ఎంత విధ్వంసంగా రానున్నది మరొకసారి వివరంగా చర్చించవచ్చు గాని, ప్రస్తుతానికి ఆ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రవేశానికీ, సరుకుల చిల్లర ధరలు తగ్గడానికీ ఏమన్నా సంబంధం ఉన్నదా లేదా చూడాలి. స్వయంగా ఆర్థికవేత్త అయిన ప్రధాన మంత్రి బట్టతలకూ మోకాలికీ ముడివేయడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో చూడాలి.

ఏ సరుకుకయినా నిర్దిష్టంగా ఏదో ఒక ధర ఉండడం అనేది అందరికీ తెలిసిన విషయమే. పారిశ్రామిక ఉత్పత్తులకయితే ఆ ధరలు చాల కచ్చితంగా ఉండడం, వ్యవసాయోత్పత్తులకయితే ఆ ధరలు ఒకచోట తక్కువగా, ఒకచోట ఎక్కువగా ఉండడం, రుతువులను బట్టి మారుతుండడం, సాధారణంగా అన్ని సరుకుల ధరలూ పైపైకి పోతూ ఉండడం అందరికీ తెలిసిన విషయాలే. కాని అసలు ఒక సరుకు ధరను నిర్ణయించే అంశాలేమిటి? అర్థశాస్త్రపు సాంకేతికమైన, జటిలమైన అంశాలను పక్కనపెట్టి సాధారణ పరిభాషలో ధరలను నిర్ణయించే అంశాలను చెప్పుకోవాలంటే అవి ఆరు. ఉత్పత్తి వ్యయం, రవాణా వ్యయం, నిర్వహణ వ్యయం, లాభం, పన్నులు, చిల్లర వర్తక కమిషన్.

ఏ సరుకునయినా తయారుచేయాలంటే కొన్ని ముడి సరుకులు, ఉత్పాదకాలు, కొంత మానవశ్రమ అవసరమవుతాయి. ముడి సరుకులు, ఉత్పాదకాలు ఎక్కువగా ప్రకృతిలో లభ్యమయ్యేవే గాని, వాటికి కూడ యజమానులు ఉండే సామాజికస్థితిలో మనం ఉన్నాం గనుక వాటిని ధరపెట్టి కొనుక్కోవలసిందే. వ్యవసాయానికయితే విత్తనాలు, నీళ్లు వంటి ప్రకృతి సహజమైన ఉత్పాదకాలు, ఎరువులు, రసాయనాలు, పనిముట్లు వంటి ఇతరంగా ఉత్పత్తి అయిన ఉత్పాదకాలు కావాలి. ఇతర సరుకులకయితే ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, వ్యసాయోత్పత్తులు వంటి సహజ వనరులు, యంత్రాలు వంటి ఇతరంగా ఉత్పత్తి అయిన ఉత్పాదకాలు కావాలి. ఈ సహజ వనరులనైనా, ఇతరంగా ఉత్పత్తి అయిన ఉత్పాదకాలనైనా వినియోగించి కొత్త ఉత్పత్తులను సృష్టించడానికి మానవశ్రమ లేకపోతే ఏ సరుకూ తయారు కాదు. అంటే సహజ వనరులు, పనిముట్లు, యంత్రాలు, మానవశ్రమల మీద పెట్టే ఖర్చు అంతా ఉత్పత్తి వ్యయంలో భాగమవుతుంది.

ఏ సరుకయినా ఒకచోట ఉత్పత్తి అవుతుంది గాని దాని వాడకం సమాజమంతా వ్యాపించి ఉంటుంది. ఆ పంపిణీ సక్రమంగా జరగాలంటే ఏ సరుకయినా ఆ సమాజంలో నాలుగు మూలలకీ రవాణా కావలసి ఉంటుంది. ఆ రవాణా వ్యయం కూడ సరుకు ధరలో భాగం అవుతుంది.

ఉత్పత్తిని నిర్వహించడానికి గాని, పంపిణీని నిర్వహించడానికి గాని, పంపిణీ అయ్యేలోపు నిలువలను నిర్వహించడానికి గాని అయ్యే నిర్వహణ వ్యయం కూడ ఇటీవలి కాలంలో చాల పెరిగిపోతున్నది గనుక ఆ వ్యయాన్ని కూడ ధరలోనే భాగం చేస్తున్నారు.

ఈ నిర్వహణ చేసినందుకుగాను తమకు అందవలసిన ప్రతిఫలం అనే పేరుతో ప్రతి ఉత్పత్తిదారూ, పంపిణీదారూ, గిడ్డంగి నిర్వాహకులూ మరికొంత భాగాన్ని ధరలో కలుపుతున్నారు. అది న్యాయమైనదేనా, అది ఉన్నా అంత ఉండవచ్చునా అనే ప్రశ్నలు ఉంటాయి గాని ఈ భాగాన్ని లాభం అనే పేరు మీద అందరూ అంగీకరిస్తున్నారు.

ఇక ఒక సరుకు ఉత్పత్తికీ, వినియోగదారుకు చేరడానికీ మధ్య ప్రభుత్వం విధించే పన్నులు ఎన్నో ఉంటాయి. డ్యూటీ, సెస్, టారిఫ్, అమ్మకం పన్ను, వాణిజ్య పన్ను, స్థానిక పన్ను, సర్ ఛార్జ్ అని వేరువేరు రూపాలలో ఉండే ఈ పన్నులు సరుకు ధరలోనే భాగమవుతాయి.

ఇవన్నీ కాక, వినియోగదారుకూ సరుకుకూ మధ్య ఉండే సరఫరా గొలుసులో ఉండే మధ్య వర్తులు, ఆ గొలుసులో చిట్టచివరి చిల్లర వర్తకులు ఆ సరుకును అమ్మినందుకు తమకు ప్రతిఫలం ఆశిస్తారు. దాన్ని సాధారణంగా వర్తక కమిషన్ అంటారు. అది కూడ ధరలో భాగమవుతుంది.

ఇవన్నీ కాక, సరుకుల ధరలు సప్లై – డిమాండ్ సూత్రం మీద ఆధారపడి ఉంటాయని, ఒక సరుకు సరఫరా కన్న గిరాకీ ఎక్కువ ఉంటే దాని ధర పెరుగుతుందని, గిరాకీ కన్న సరఫరా ఎక్కువ ఉంటే ధర తగ్గుతుందని అర్థశాస్త్రం బోధిస్తుంది. ఐతే మొత్తంగా ధరల మీద దీని ప్రభావం స్వల్పకాలికంగా ఉండవచ్చు గాని దీర్ఘకాలికంగా అంత ఎక్కువ ఉండదు. మార్కెట్ లో ఒక సరుకు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధర పెరుగుతుందనుకుంటే, అలా ధర పెరగగానే, తమ లాభం కూడ పెరుగుతుంది గనుక ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి పెంచుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. అలా సరఫరా పెరిగింది గనుక ధర తగ్గుతుంది. అప్పుడు ఆ సరుకు ఉత్పత్తి లాభసాటి కాదు గనుక ఉత్పత్తిదారులు ఆ సరుకును తగ్గిస్తారు. ఇలా అటూ ఇటూ ఊగిసలాట అంతిమంగా ధర మధ్యస్తంగా స్థిరపడడానికి దారి తీస్తుంది. అంటే సరఫరా – గిరాకీ ప్రభావం తగ్గిపోతుంది.

ఈ వివరణంతా ఎందుకంటే ధరలను నిర్ణయించే ఆరు అంశాలలో దేని కారణంగా ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయో నిర్ధారించుకుంటే, దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తే ధరల పెరుగుదలను అరికట్టవచ్చు. ఉత్పత్తి వ్యయం సాధారణంగా సహజవనరుల విషయంలో ఆ కాలపు సాంకేతిక పరిజ్ఞానం స్థాయిని బట్టి, మానవశ్రమ విషయంలో ఆ కాలపు జీవన ప్రమాణాలను బట్టి నిర్ణయమవుతుంది. కనుక ఉత్పత్తి వ్యయాన్ని కచ్చితంగా అంచనాకట్టడం, అదుపు చేయడం, ధరమీద అది ఎంత ప్రభావం వేస్తుందో గుర్తించడం సాధ్యమే.

ఇక రవాణా వ్యయం సాధారణంగా రవాణా దూరాన్ని బట్టి, రవాణాకు అవసరమైన ఇంధనవ్యయాన్ని బట్టి ఉంటుంది. ఉత్పత్తిని, పరిశ్రమలను వికేంద్రీకరించడం ద్వారా దూరాన్ని తగ్గించవచ్చు. ఇంధన వనరుల సక్రమ వినియోగంద్వారా, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణ ద్వారా ఆ వ్యయాన్ని కూడ అదుపులో పెట్టవచ్చు.

నిర్వహణ వ్యయాన్ని కూడ ప్రణాళికా బధ్దమైన ఉత్పత్తి, పంపిణీ, రవాణా, నిలువల ద్వారా అదుపులో పెట్టవచ్చు, సరుకుల ఉత్పత్తిదారులు విపరీతమైన లాభాలు గడించకుండా, గుత్తాధిపత్యం ద్వారా అభ్యంతరకరమైన వర్తక పద్ధతులను పాటించకుండా చూసే చట్టాలు ఉన్నాయి. 1992 తర్వాత ఆ చట్టాలను ప్రభుత్వమే సవరించి, పలుచబరచినప్పటికీ, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం కూడ మితిమీరిన లాభాలనూ, గుత్తధిపత్యాన్నీ అరికట్టవచ్చు. కనుక ప్రభుత్వం తలచుకుంటే లాభాలరేటు మీద, వర్తక కమిషన్ రేటు మీద ఆంక్షలు విధించవచ్చు.

ఇక పన్నులు విధించే అధికారం పూర్తిగా ప్రభుత్వానిదే గనుక పన్నుల విధానాన్ని హేతుబద్ధంగా, న్యాయంగా తయారు చేయవలసి ఉంటుంది. అక్రమార్జన మీద ఎటువంటి పన్నులు విధించకుండా, ఎప్పటికప్పుడు రాయితీలు ప్రకటిస్తూ వస్తున్న ప్రభుత్వమే పరోక్ష పన్నుల రూపంలో ప్రతి సరుకు కొనుగోలు మీద కనబడని పన్నులు విధించి ప్రజల నెత్తురూ చెమటా పీల్చుకుంటున్నది. పన్నుల విధానాన్ని మార్చడం ద్వారా సరుకుల ధరలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు.

అందువల్ల ధరలు తగ్గుతాయా లేదా అనేది ప్రభుత్వం చేతిలో ఉన్న పని. దానికీ విదేశీ పెట్టుబడి ప్రవేశానికీ సుదూర సంబంధం కూడ లేదు. తాడిచెట్టుకూ దూడగడ్డికీ, బట్టతలకూ మోకాలికీ ఉన్నంత సంబంధం కూడ ధరల తగ్గుదలకూ విదేశీ పెట్టుబడులకూ లేదు. ప్రజలు అనుభవిస్తున్న ఒక నిత్యజీవిత సమస్యను సాకుగా చూపి ప్రపంచబ్యాంకు మాజీ ఉద్యోగి ప్రవేశపెట్టదలచుకున్న మూడో తరం ఆర్థిక సంస్కరణలలో భాగమే చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి


 
 •  శాస్త్ర విజ్ఞానము: అహములు దీర్ఘములయ్యె...
సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం దూరాన్ని కాలంగాను, కాలాన్ని దూరం గాను కొంతవరకు మార్చడానికి వీలవుతుందని ఇందాక చెప్పుకున్నాం. కాని కాంతి వేగం యొక్క విలువ అత్యధికం కావడం వల్ల అలాంటి మార్పు దైనందిన జీవన అనుభవంలో మనకి కనిపించదు.కాని అధిక వేగాల వద్ద (అంటే కాంతివేగంతో పోల్చితే గణనీయమైన విలువ గల వేగాల వద్ద) ఇలాంటి మార్పులు ప్రస్ఫుటం అవుతాయి. ఉదాహరణకి ఎలక్ట్రాన్ల వంటి సూక్షరేణువుల గమనంలో ఈ ఫలితాలు కనిపిస్తాయి
 
 •  నెమలికన్ను: బేరం
బేరమాడడం అనేది మన జీవితంలో ఒక భాగం అని చెప్పాలేమో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వస్తువుని బేరం చేసే ఉంటారు. నిజానికి ఈ బేరం ఆడడం అనేది ఒక కళ అనిపిస్తుంది నాకు. ఈ కళలో మగ వాళ్ళతో పోల్చినప్పుడు మహిళలు నిష్ణాతులు అనడానికి కూడా ఎలాంటి అభ్యంతరమూ లేదు నాకు. ముందుగా ఒప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే నాకు బేరమాడడం పెద్దగా రాదు. అయినా అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. నా చిన్నప్పుడు మా ఊళ్లోకి బట్టల
 
 •  ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: బాసుల పై సర్వే వ్యవహారం: మీ టైం తిన్నందుకు సారీ....
బెస్ట్, వరస్ట్ బాస్ ఎంపిక కోసం చేసిన అభిప్రాయసేకరణ గందరగోళానికి దారి తీసింది. శాస్త్రీయత లోపించిందని పలువురు మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా చెప్పిన మీదట...తుది ఫలితాలు చూసిన తర్వాత ఇవి ప్రకటించకపోవడం ఉత్తమమని అనిపించిందని తెలియజేయడానికి చింతిస్తున్నాను. నేను అనుకున్న సాంపిల్ సైజ్ కూడా రాలేదు. పైగా....ఈ ఆన్ లైన్ సర్వే నచ్చక పోవడం వల్ల కావచ్చు ఒక సోదరుడు/ సోదరి...వరస్ట్ బాస్ కాలంలో 'రాము' అనే పేరు ఒక
 
 •  తెలుగు తూలిక: నేటి విద్యార్థులు (ఆడియో)
అనిల్ అట్లూరి ప్రోత్సాహంతో ఒక ఆడియో చేసి చూద్దాం అనుకుని, ఇది చేశాను. నిజానికి, ఆడియో చెయ్యడానికి గళంలో నాటకీయత కావాలి. మాఅమ్మాయికి తెలుగొచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపించే క్షణాలన్నమాట. రెండోది కథలో వివిధస్వరాలు పలికించే అవకాశం ఉండాలి. అలా ఉన్నవి ప్రాప్తంలాటి కథలు కానీ అవి ప్రచురించడం అయిపోయింది కనక, మళ్లీ వినే సరదా ఉండకపోవచ్చనీ ఇది ఎంచుకున్నాను. ఈ స్కెచ్ (నిజంగా కథ కాదు కదా) నేను ఇంటర్ చదివేరోజుల్లో రాసింది. ఇప్పటికింకా [...]
 
 •  తెలు-గోడు: కలాపోసన – 6
ఆఁ రండి బాబూ ర్రండి. వరల్డు ఫేమస్ హాలీచెక్క నిర్మాణ సంస్థ గత శతాబ్దపు నక్క నూట పదహారు కోట్లు తగలేసి మొట్టమొదటిసారి తెలుగులో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ఈస్ట్‌మన్ కలర్ పూర్తి రంగుల సాంఘిక, సామాన్య, గణిత, తెలుగు పిక్చర్; ఆంధ్రా సీడెడ్ నైజాముల్లో నమ్మశక్యంగాని రేట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన చిత్రరాజం; మొదటి ఆటకే కనీవినీ ఎరగని కలెక్షన్ల తుప్పరతో బాక్సాఫీసు బూజు దులిపి, చిమ్మి, అలికి, ముగ్గేసి మూడొందల ఆరు కోట్ల షేర్‌తో ముగ్గురు మూర్ఖుల రికార్డు బద్దలు కొట్టిన సూపర్ డూపర్ హిట్ సినిమా; విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయఢంకా, డప్పు, డోలు, డ్రమ్ము, ఎట్సెట్రా, ఎట్సెట్రా మోగిస్తూ శరవేగంగా జతదినోత్సవంకేసి పరుగులు తీస్తున్నటువంటి పరమాద్భుత చిత్రం 'చేపల తొట్టి' - నేడే విడుదల మీ అభిమాన సిన్మా హాల్లో. చూడండి. చూసి తరించండి.
 
 •  ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: BBC లో అద్భుతమైన ప్రోగ్రాం...Reporters
ఉదయం నుంచి సన్నని జల్లు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక షార్టు, టీ షర్టు తగిలించి స్లిప్పర్స్ తో బురదలో కాసేపు ఒక రౌండ్ వేసి వచ్చా. టేబుల్ టెన్నిస్ అంటే...ప్రాణం పెట్టే ఒక మంచి బ్యాచ్ తో చిరు జల్లులో తమాషా కబుర్లు, వేడి వేడి బడ్డీ చాయ్. నిజమైన హాలిడే ఫీలింగ్ చాలా రోజుల తర్వాత కలిగింది. మంచి బిర్యానీ తినాలన్న వెర్రి కోరిక కలిగింది. నయా పైసా లాభం లేని ఈ బ్లాగు ప్రపంచంలో ఒక రెండు గంటలు వద్దు
 
 •  రాతలు-కోతలు: ఇది నేరమా?

ఇది నేరమా?

ఇది సగటుమనిషిస్వగతం శీర్షికన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది. అయితే, కొన్ని వాక్యాలు మిస్సవటం, కొన్ని అచ్చుతప్పులవల్ల అర్ధం చేసుకోవటం కష్టమవుతుందేమోనని, నా వ్రాత ప్రతిని కూడా జతపరుస్తున్నాను.

 
 •  శాస్త్ర విజ్ఞానము: కాలం (Time) + ఆయతనం (Space) = కాలాయతనం (Space-time) (సు.సా.-9)
1. ఒక వ్యవస్థ నుండి చూసినప్పడు ఏకకాలీనం (simultaneous) అయిన రెండు సంఘటనలు మరో వ్యవస్థలో ఏకకాలినం కాకపోవచ్చు.పై వాక్యం కాస్త విడ్డూరంగా అనిపించవచ్చు. కాని దాన్ని వివరించడానికి ఓ చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు రైల్లో ప్రయాణిస్తూ భోజనం చేస్తున్నారు. ఇక్కడ రెండు సంఘటనలని తీసుకుందాం. భోజనం మొదట్లో కూర కలుపుకునే సంఘటన, భోజనం చివర్లో పెరుగు కలుపుకునే సంఘటన. మీ దృష్టిలోను, మీ తోటి ప్రయాణీకుల
 
 •  వీవెనుడి టెక్కునిక్కులు: బయటి ప్రపంచంలో యూనికోడ్ తెలుగు – 2
దుకాణాల నామఫలకాలపై కూడా యూనికోడ్ తెలుగు వాడటం మొదలైంది. పై బోర్డులో ఉన్న తెలుగు అక్షరాలు విండోస్ XPలో ఉండే తెలుగు ఖతి గౌతమివి. ఈ దుకాణం, హైదరాబాదులో కృష్ణనగర్ నుండి జూబ్లిహిల్స్ వెళ్ళే దారిలో ఉంది. పటపు లంకె. థామస్ కుక్ వారు కూడా తమ నామఫలకాలపై తెలుగుని ఉపయోగించారు. పోతన ఖతిలా అనిపించింది. (సికిందరాబాద్ లోని ఆనంద్ సినిమా హాలు దగ్గర) వెళ్తూన్న బస్సులో నుండి చూసాను, పరీక్షగా చూసే అవకాశం రాలేదు. ఎవరైనా [...]
 
 •  తెలు-గోడు: పత్తిత్తులు
వారం రోజులుగా ఆంధ్రదేశంలో తెడేపాయేతర నాయకులందరి నోటా మోత మోగుతున్న మాట: రాజకీయం. బాబ్లీ గొడవలో చంద్రబాబునాయుడు రాజకీయం చేస్తున్నాడట. చూడబోతే, రాజకీయం అనేదో పరమ ఛండాలమైన పనని వాళ్ల ఉద్దేశంలాగుంది. అఫ్‌కోర్స్, మన ఉద్దేశమూ అదే అనుకోండి. కానీ ఆ మాట స్వయానా రాజకీయులే చెప్పుకోటం విడ్డూరం.
 
Updated: 617 minutes ago
Disclaimer Copyright Terms of Service & Privacy Policy Sitemap Great Links
Bookmark and Share